- డిఆర్డీడివో,జీహెచ్ ఎంసీ,హెచ్ఎండీ ఏ, పొలీస్,ఆర్ అండ్ బి శాఖల అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: ఈ నెల 28న కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజనాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 28న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే జాతీయ సైన్స్ దినోత్సవం విజ్ఞాన్ వైభవ్ 2025 కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గచ్చిబౌలి స్టేడియంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు.గురువారం గచ్చిబౌలి స్టేడియంలో డిఆర్డిఓ అధికారులు,హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి, ఆర్ అండ్ బి,పోలీస్,ఇతర అధికారులతో శాఖల వారిగా కేటాయించిన పనులను ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.తదుపరి హెలిపాడ్ ను,ఇండోర్ స్టేడియం లో స్టాల్స్ ను పరిశీలించారు.విఐపిల పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు.విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన విద్యుత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్డిఓ డైరెక్టర్ కృష్ణమూర్తి, గచ్చిబౌలి ఏసిపి శ్రీకాంత్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
