Take a fresh look at your lifestyle.

రాచకొండ కమిషనర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

ముద్ర, ఇబ్రహీంపట్నం: రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబుని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.ఈ నెల 14వ తేదీన కుంట్లూరులో తమ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానం పలికారు. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సిపి సుధీర్ బాబు చూపుతున్న చొరవను కొనియాడారు. రాచకొండ కమిషనర్ ను కలిసిన వారిలో  కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బర్రె రాజ్ కుమార్, పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మండల కోటేశ్వర్ రావు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ పెద్ద అంబర్ పేట అధ్యక్షులు బొర్ర శ్రీకాంత్, ఎల్బి నగర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బోడ రాజశేఖర్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.