రామకృష్ణాపూర్, ముద్ర : వాహన చోదకులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పట్టణ ఎస్ఐ జీ.రాజశేఖర్ సూచించారు.శుక్రవారం స్థానిక కర్మపల్లి స్టేజి వద్ద వాహన చోదకులకు అవగాహన కల్పించారు.హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తున్న చోదకులకు పుష్పాలను అందించి ఎస్ఐ అభినందించారు.మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. రెండో ఎస్సై లలిత,హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య,సిబ్బంది పాల్గొన్నారు.