- యాంత్రీకరణ ప్రభావం కాస్ట్ అఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ పై డాక్టరేట్
- డాక్టరేట్ పొందిన గెంటీల రాంబాబుకు అభినందనలు
ముద్ర,పానుగల్: పానుగల్ మండల కేంద్రానికి చెందిన గెంటీల బిచ్చన్న,ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు రాంబాబు కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.ఆయన కాస్ట్ అకౌంటెంట్ గ ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఇదివరకే (2015) సిఎంఏ (ICWAI) ఫైనల్ పరీక్షలలో జాతీయ స్థాయిలో ఇరవై మూడోవ (23) ర్యాంక్ సాధించాడు.వ్యవసాయ కుటుంబానికి చెందిన రాంబాబు పదవ తరగతి నీ పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో,ఇంటర్ విద్యను సీవీ రామన్ కళాశాల వనపర్తిలో,గ్రాడ్యుయేషన్ విద్యను వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో పూర్తి చేసి యూజీసీ నెట్ అర్హత ద్వారా పి.హెచ్.డి (Ph.D) 2018 లో ప్రవేశం పొందాడు.ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ డీన్ కే. కృష్ణ చైతన్య గారి పర్యవేక్షణలో “తెలంగాణ రాష్ట్రంలో యాంత్రీకరణ ప్రభావం కాస్ట్ అఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ “అనే అంశం ఫై పి హెచ్ డి (Ph.D) పూర్తి చేసాడు.డాక్టరేట్ పొందిన రాంబాబును గ్రామస్తులు,తోటి మిత్రులు అభినందించారు.
