Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వ నిధులతో పంచాయితీలు అభివృద్ధి

  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందె బాబయ్య

ముద్ర/షాద్ నగర్:  కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామపంచాయతీలు అభివృద్ధి సాధిస్తున్నాయని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అంజయ్య బాబయ్య లు వివరించారు.బుధవారం ఫరూక్ నగర్ మండల పరిధిలోని విట్యాల గ్రామంలో మాజీ సర్పంచ్ జయశ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని వివరించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్న నేటికీ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని వాపోయారు.వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతుందే తప్ప రాష్ట్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు పంచాయతీలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.గత పది సంవత్సరాలనుండి తెలంగాణలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిదులనుండే అని అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు గ్రామ పంచాయతీ లకు,మున్సిపాలిటీలకు అనేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించి ఉంటే కేంద్రం నుండి అనేక నిధులు వచ్చేవని అన్నారు.గత పాలకులు గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీరు గత పాలకుల మాదిరిగానే వ్యవహరించడం సిగ్గు చేటని అన్నారు.సీసీ రోడ్లు, వీధి లైట్లు, త్రాగు నీరు కు కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించడం జరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పిట్టల సురేష్, రఘు గౌడ్, శివ శంకర్, వినోద్ నాయక్, విష్ణు, వెంకటేష్, సునీత,అభిరామ్, భైరమోని వెంకటేష్,రెబ్బనమోని యాదయ్య, జె రమేష్,యాదయ్య, టిక్యా, జెటవత్ శ్రీను, చిన్న రాజు, కావలి యాదయ్య, c నర్సిములు, రవి, కృష్ణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.