Take a fresh look at your lifestyle.

అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

ముద్ర ప్రతినిధి : పెద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వి. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయుడిని భక్తితో ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని అన్నారు. హనుమంతుడు గురుభక్తి, ధైర్యం, క్రమశిక్షణకు ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీరాముని ఆజ్ఞలను ఆలస్యం లేకుండా అమలు చేసి సత్ఫలితాలు సాధించిన మహానుభావుడు ఆంజనేయుడని కొనియాడారు.

హనుమాన్ జయంతి రోజున భక్తులు ఉపవాసం పాటిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం భారతీయ సంప్రదాయంలో భాగమని తెలిపారు. వైశాఖ శుద్ధ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవడం విశేషమని పేర్కొన్నారు. ఆంజనేయుడు బలవంతుడు, ధైర్యవంతుడు, సద్గుణవంతుడు అని కొనియాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో భక్తులు ఆరాధిస్తారని చెప్పారు.

జయంతి సందర్భంగా ఆలయంలో విశేష అభిషేకాలు నిర్వహించగా, హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. అనంతరం మృత్వికుల బృందం డా. నరేందర్ రెడ్డిని ఆశీర్వదించి, చేపట్టబోయే కార్యక్రమాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, విద్యాసంస్థల సిబ్బంది, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.