- త్వరలోనే చర్యలు తీసుకుంటాం.
- హైడ్రా కమిషనర్ రంగనాథ్.
గండిపేట్, ముద్ర విలేకరి : మణికొండ మున్సిపల్ పరిధిలోని ముష్కి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలసిన ఆక్రమణలను సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మండిపడ్డారు.ఈ మేరకు ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా చెరువులో మురుగు నీరు కలవడంపై ఆయన మండిపడ్డారు. సర్వే నెంబర్ 259 లో ముష్కి చెరువు 52 ఎకరాలు, అందులో 17.25 ఎకరాల స్థలం ఉంది. చెరువు దగ్గర జరుగుతున్న విధ్వంసంపై స్థానికంగా నివాసం ఉంటున్న హాల్ మార్క్ విసినియా, అదేవిధంగా మై హోమ్ అవతార్ గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన పలువురు సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం ముష్కి చెరువును మణికొండ మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో పరిశీలించారు. చెరువులో మురుగు నీరు ఎందుకు కలుస్తుందని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా చెరువు సుమారు 52 ఎకరాల విస్తీర్ణం అయితే సుమారు 12 ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టారని మండిపడ్డారు.ఇష్టారాజ్యంగా కట్టలు నిర్మించడాన్ని ఆయన తప్పుపట్టారు.అడ్డగోలుగా వ్యవహరించిన ధృవంశ్ సంస్థ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో మురుగునీరు కలవకుండా ఏరియల్ సర్వే చేయిస్తామని ఆయన స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. మంగళవారం ప్రజలు రంగనాథ్ ను ముస్కి చెరువులో వస్తున్న మురుగునీరు, ఎఫ్ టీఎల్ మట్టి నింపిన విషయం, అభివృద్ధి పేరుతో ధృవంశు అనే సంస్థ సీసీ డ్రైన్ ను ధ్వంసమైన విషయం, మట్టి చెరువు ముఖ ద్వారం వద్ద కుప్ప పోయడం వల్ల జరుగుతున్న అనర్థాలను వివరించారు.
- చర్యలు తీసుకుంటాం..
తక్షణమే అన్ని డిపార్ట్మెంట్ లతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని రంగనాథ్ తెలిపారు. నాలా సర్వే, ఏరియల్ సర్వే చేయడం, ఎక్కడనుంచి ఈ మురికి నీరు వస్తుందో దాని మూలాలు తెలుసుకుని డైవర్షన్ చేస్తామన్నారు. ఎఫ్టీఎల్ మట్టిని, ఆక్రమణలను తొలగించడం త్వరలోనే జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే కమ్యూనిటీకి ఉన్న ఇబ్బందులు తొలగించమని మణికొండ మున్సిపల్, ఇరిగేషన్ అధికారులకు చెప్పారు. రేపు ఉదయం ఇరు డిపార్ట్మెంట్ వారు, తత్త్వ సంస్థ వారు వచ్చి గేట్ ముందు పెద్ద మొత్తంలో పోసిన మట్టిని, మురికి నీరు డ్రైన్ లో కలవకుండా పనులు, మొదలు పెడతామని ప్రజలకు చెప్పారు.