Take a fresh look at your lifestyle.

గనులపై ఘనంగా “కేటీఆర్” జన్మదిన వేడుకలు

యైటింక్లయిన్ కాలని, ముద్ర: సింగరేణి రామగుండం రెండవ ఏరియా బొగ్గు గనులపై, 8వ కాలనీ లలో గురువారం, మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం టిబిజికెఎస్ ఆధ్వర్యంలో ఏరియా వర్క్ షాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘం ఏరియా ఉపాధ్యాక్షులు ఐలి శ్రీనివాస్ తోటి నాయకులను కలుపుకుని కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన కార్యకర్తలను, స్తానిక ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేటీఆర్ యువ నాయకుడి గా రాష్ట్ర పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మాత్యులుగా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ ఎగుమతులు 40 వేల కోట్ల నుండి 1,70,000 కోట్లకు చేరుకున్నాయ న్నారు. అంతే కాకుండా ఐటి, పరిశ్రమల శాఖ మాత్యులుగా 16 లక్షల ఉద్యోగాలను సృష్టించి, తెలంగాణ యువత కు కల్పించారన్నారు. మున్సిపల్ శాఖ మాత్యులు గా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అద్భుతమైన అభివృద్ధినీ చేపట్టి, రాష్ట్ర యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని ఆయన కొనియాడారు. ఇక ఈ వేడుకల్లో నాయకులు సీహెచ్. ప్రభాకర్ రెడ్డి, శశాంక్, మల్లేశ్వరరావు, శ్రీనివాస్, రఘు, సత్తయ్య, అజయ్, రవీందర్, లెనిన్, రాజు, కృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 8వ కాలనీ వాటర్ ట్యాంక్ కూడలిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ పట్టణ అధ్యక్షులు మేడి సదయ్య, స్తానిక మాజీ కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు బాలరాజ్, ఎర్రవెల్లి గోపాల్ రావు, గూడెల్లి రామచందర్, స్టాలిన్, వలియోద్దీన్, బి. చంద్రయ్య, టి. కుమార్ యాదవ్, కటకం సతీష్, కొత్వాల రాజయ్య, పోతుల రాయమల్లు, గుడిసెల రవి, గుడిసెల మోహన్, పి. రాకేష్, స్వరూప, రోజా, సుజాత, శకుంతల పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.