ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
సమాజ సేవ చేయాలని, నలుగురికి సాయం చేయాలన్న తలంపుతో ఉన్నవారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరాలని ఆ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీ నరసింహ రెడ్డి, డివిజన్ కమిటీ చైర్మన్ సద్ధి వెంకట్ రెడ్డి కోరారు. శుక్రవారం భువనగిరిలో పాత వివేరా హోటల్ వద్ద జిల్లా రెడ్క్రాస్ కార్యాలయంలో సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ డాటా సెంటర్ ను వీరిద్దరూ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ అయినా రెడ్ క్రాస్ లో సభ్యత్వం తీసుకుని ,తమ శక్తి మేర స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనాలని, కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జూన్ నెల 15 వరకు నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో తమ కార్యాలయంలోనూ, ఆన్లైన్లో, ఆఫ్ లైన్ లో, సభ్యత్వాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మండల కేంద్రాలలో తమ జిల్లా డైరెక్టర్ల వద్ద కూడా సభ్యత్వాన్ని స్వీకరించవచ్చని వివరించారు.జిల్లాలోని అన్ని మండల కేంద్రాల రెడ్ క్రాస్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు గ్రామాలలోనూ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు చేపట్టాలని కోరారు. జిల్లా కమిటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ మాట్లాడుతూ సేవా నిరతి కల వారందరూ రెడ్ క్రాస్ లో సభ్యులుగా చేరవచ్చు అని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రెడ్ క్రాస్ ద్వారా వారికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ డైరెక్టర్లు శేక్. హమీద్ పాశ,ఎస్.ఎన్ చారి,ప్రభాకర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, జంపాల అంజయ్య, రాంబాయి, డివిజన్ కమిటీ డైరెక్టర్లు,ఐలేని రాంరెడ్డి,నిమ్మయ్య,జిల్లా కార్యదర్శి క్రిస్టోఫర్,పట్టణ కమిటీ డైరెక్టర్,లావణ్య,కరిపే నర్సింగ్ రావ్,మచెందర్,రాజు పాల్గొన్నారు..