ముద్ర నడిగూడెం…
యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు గురువారం మండల కేంద్రంలో పిఎసిఎస్ ముందు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
యూరియా పొందేందుకు యాప్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని కోరారు.సకాలంలో యాప్ లో బుక్ కావడం లేదని రైతులు రాస్తారోకో నిర్వహించారు. సాంకేతిక సమస్యలు, నెట్వర్క్ సమస్యలతో యూరియా కట్టలు పొందలేకపోతున్నామని, స్లాట్ బుక్ చేసిన సెకండ్ లోనే నో స్టాక్ చూపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసిన వారిలో రైతులు, గుండు శ్రీను, నక్క సైదులు, జానీ మియా , వందనపు చంద్రమోహన్, గునుగుంట్ల పోతురాజు, గునుగుంట్ల బుచ్చిరాజు, వట్టి మహేష్, నక్క మహేష్, మెడిసిన మెట్ల రాజశేఖర్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు షేక్ సుభాని కోరారు.

.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మండల కేంద్రంలో సిఐటియు అనుబంధ సంఘమైన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నడిగూడెం బస్టాండ్ సెంటర్ నుండి ఎంపీడీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఎంపీఓ విజయ కుమారికి వినతి పత్రం అందజేశారు.గ్రామ పంచాయతీ కార్మికుల ర్యాలీకి సిపిఎం పార్టీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిపి వర్కర్స్ యూనియన్ మండలాధ్యక్షుడు సుభాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, ఈ కోడ్ వల్ల కార్మికులపై పనిభారం అధికమైతుందని అదేవిధంగా కార్మికులకి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారికి ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదని, కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే దహన సంస్కారాలకి 20 వేల రూపాయలు తక్షణ సహాయం కింద ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బెల్లంకొండ సత్యనారాయణ, సిఐటియు మండల కన్వీనర్ మల్లెల వెంకన్న గ్రామ పంచాయతీ వర్కర్లు నందిపాటి వెంకన్న, చిమట నాగరాజు,రాజుల రామయ్య,చాపల వెంకన్న, ప్రమోదు, మధుసూదన్,శీను ఎర్రన్న,వీరస్వామి, సక్కుబాయమ్మ,
వెంకటమ్మ,తదితరులు పాల్గొన్నారు.