ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి పట్టణానికి చెందిన కుక్కదువ్వ సోమయ్య 1987నుండి 2009 వరకు మూడుసార్లు కౌన్సిలర్ గా ప్రజలకు సేవలు అందించారు. భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి వెంట ఉంటూ ఎమ్మెల్యే గత ఎన్నికల గెలుపులో కీలక పాత్ర వహించిన సోమయ్య ఈ సారి మాత్రం కుక్కదువ్వ పద్మ సోమయ్య చైర్మన్ కి అన్ని అర్హత లు ఉన్నాయి కావున మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇవ్వాలని ప్రజలు, నాయకులు కోరుతున్నారు.