- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
- బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి.
ముద్ర, మధిర : మధిరలో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బిజెపి పార్టీ మధిర అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయి ప్రారంభించకుండా ఉన్న వంద పడకల ఆసుపత్రి ఎదుట పట్టణ బీజేపీ అధ్యక్షులు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అన్నీ సదుపాయాలతో మెరుగైన వైద్యం కోసం ఎదురు చూస్తున్నారని, వైద్యం కోసం అన్నీ విభాగల్లో సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజలకు అవసరమైన ఆసుపత్రిని ప్రారంభించేందుకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు.వెంటనే వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని, లేనిపక్షంలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు,జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, మండల అధ్యక్షులు గుండా శేఖర్ రెడ్డి, పాపట్ల రమేష్, సీనియర్ నాయకులు గడ్డం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.