Take a fresh look at your lifestyle.

వరి కోతల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

రామకృష్ణాపూర్,ముద్ర : యాసంగి వరి కోతల సమయంలో రైతులు నాణ్యత ప్రామాణాలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి జీ.కిరణ్మయి తెలిపారు.బుధవారం మందమర్రి మండలంలోని బొక్కల గుట్ట గ్రామంలో రైతులకు యాసంగి వరి కోతలు,కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తరణ అధికారులు కనకరాజు,తిరుపతి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్తి పరిపక్వత చెంది, ఆరిన వరిని మాత్రమే కోతలు చేపట్టాలన్నారు.గింజలో తేమ 14 నుంచి 17 శాతం ఉండాలని,హార్వెస్టర్ యంత్రం బ్లోయర్ ఫ్యాన్ వేగం18 నుంచి 20 ఆర్.పి.యం తో చేస్తే తాలు,తప్ప లేని నాణ్యమైన ధాన్యాన్ని పొందడమే కాకుండా కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.బొక్కల గుట్ట గ్రామ పరిధి రైతులు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.