Take a fresh look at your lifestyle.

వరంగల్ జాతీయ రహదారిపై కారు దగ్ధం

బీబీనగర్, ముద్ర: బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలో కేపాల్ వద్ద ఓ కారులో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీఎస్03 ఈఎన్ 6575 నంబర్ గల ఈ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన కారు యజమాని వెంటనే అప్రమత్తమై వాహనం నుంచి దిగిపోవడంతో, పెద్ద ప్రమాదం తప్పింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు స్పందించలేదు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.