ముద్ర, చిట్యాల :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా, బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో డా, బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం, పట్టుదలగా చదివి అంబేద్కర్ ప్రపంచ మేధావిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం,కెవిపియస్ జిల్లా నాయకులు బొడ్డు బాబురావు, బెల్లపు హరిబాబు,సిరిపంగి యాదయ్య, బూరుగు విజయ్ కుమార్, డివై ఎఫ్ ఐ జిల్లా నాయకులు బూరుగు గోపికృష్ణ, సిపిఎం నాయకులు కొంపెల్లి రమేష్,నర్రా బిక్షం రెడ్డి, బూర్గు యాదయ్య ,బూర్గు అజయ్ కుమార్, బూర్గు శ్రీనివాస్ DYFi చిట్యాల ఉపధ్యక్షులు కొంపెల్లి భరత్ పాల్గొన్నారు.