Take a fresh look at your lifestyle.

స్వర్గీయ కోట శ్రీనివాస్ కు కాషాయ వాదుల నివాళులు

యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: స్థానిక బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి కాలనీ మండల శాఖ సభ్యులు, సోమవారం స్వర్గీయ ఉమ్మడి అంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే, హాస్య నటుడు కోట శ్రీనివాస్ కు నివాళులు అర్పించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఆకుల శశి కుమార్ ఆధ్వర్యంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ సభ్యులు మృతుడు పద్మ శ్రీ అవార్డు గ్రహిత, విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..750 కి పైగా సినిమాల్లో నటించిన గొప్ప నటుడు, హాస్య నటుడుని కోల్పోవడం సీనిపరిశ్రమకు తీరని లోటన్నారు. ఇక ఆయన కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన వారు సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూకిరి రాజు, పొట్ల వెంకటేష్, దాసరి శ్రీనివాస్ ఆకుల కుమార్, దూడపాక కుమార్, గంధం శంకర్, మండ సాయి ప్రణీత్, పాషా, అంకం కుమార్, చిట్టిపల్లి నాగేంద్రం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.