చలివేంద్రం కేవలం చల్లటి నీటిని అందించే ప్రదేశం మాత్రమే కాదు,అది మానవత్వానికి, దాతృత్వానికి ప్రతీక: రవికుమార్ యాదవ్
మాదాపూర్, ముద్ర విలేఖరి: మియాపూర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆర్ కే వై టీ అధ్యక్షులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బాటసారుల దహదీర్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డివిజన్ ముఖ్య నాయకులతో కలిసి శేరిలింగంపల్లి భాజపా కాంటెస్టెడ్ అభ్యర్థి మారబోయిన రవి కుమార్ యాదవ్ ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ చలివేంద్రాల ఏర్పాటు చెయ్యాలని, సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే స్ఫూర్తి ప్రతి మనిషిలో కలగాలని రవికుమార్ యాదవ్ సూచిస్తూ, చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.అయితే, కొన్నిచోట్ల చలివేంద్రాల నిర్వహణ సరిగా ఉండటం లేదు, పరిశుభ్రత పాటించకపోవడం, తగినంత నీరు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని, చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యమని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాగుల్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, మనోహర్ గౌడ్, మాణిక్ రావు,రాజేష్ గౌడ్, శ్రీనివాస్, జితేందర్, శివరాజ్ ,ప్రసాద్, రాము, శ్రీనివాస యాదవ్, ముఖేష్ గౌడ్,సురేష్ ముదిరాజ్ ,విజయేందర్, ప్రభాకర్ ,చంద్రకాంత్, ప్రవీణ్,పాపయ్య,చందు,గోపి, మంజుల మొదలగు వారు పాల్గొన్నారు.
