ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : పార్లమెంటులో వక్ఫ్ బోర్డ్ బిల్ పాసైన సందర్భంగా భారత ప్రధాని శ్రీనరేంద్ర మోడీ గారి చిత్రపటానికి కల్వకుర్తి బిజెపి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలకా లంగా పేద ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ బిల్లుతో నిరోధించవచ్చు ఉన్నత వర్గాల చేతిలో చిక్కుకున్న భూములను పేద ముస్లింలకు వాటా దక్కేల ఈ బిల్లు కృషి చేస్తుందని అన్నారు.