6వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. గ్రామాలు, పట్టణాలలో స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు శుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు సేవలను వేగవంతం చేయాలన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో ఉన్న పనుల పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. టెలీకాన్ఫరెన్స్ సమావేశంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ హరికృష్ణ, డీపీఓ శ్రీలత, మున్సిపల్ కమిషనర్ జోనా,డీఎల్పీఓ మల్లికార్జున రెడ్డి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపిఓలు పాల్గొన్నారు.