సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: సోమవారం సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా తిరుమలగిరిలో సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ముందు పలు ప్రభుత్వ నూతన భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు.అందులో యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగూడూరు మండల తహసిల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణం కోసం రూ.3.75 కోట్లు,మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణానికి రూ.4 కోట్లు,అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రూ.3.50 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు.అనంతరం నాగారం మండల తహసిల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణం కోసం రూ.3.75 కోట్లు,మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణానికి రూ.4 కోట్లు,అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రూ.3.50 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు.అనంతరం తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లిలో 10,000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాము నిర్మాణానికి రూ.11 కోట్ల 70 లక్షల వ్యయoతో శంకుస్థాపన చేశారు. అనంతరము తిరుమలగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల కోసం రూ.5 కోట్ల30 లక్షల వ్యయాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు.అనంతరం సభా వేదిక వద్దకు చేరుకున్నారు.