- 80%నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం.
- తెల్ల రేషన్ కార్డుల పంపిణీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం.
- రాష్ట్ర వ్యాప్తంగా 5.61 లక్షలకు పైగా రేషన్ కార్డులు.
- అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు.
- తెల్ల రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ.
- ఆహార భద్రత కు పెద్ద పీట వేసింది సోనియాగాంధీ.
- సోనియాగాంధీ అడుగు జాడల్లో రాష్ట్ర ప్రభుత్వం.
- బి.ఆర్.ఎస్ ప్లంలో పాలనలో తెల్ల రేషన్ కార్డుల మంజూరు పై నిర్లక్ష్యం.
- మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల మంజూరులో యావత్ భారత దేశంలో నే తెలంగాణా రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక సందర్భంగా ఆయన అభివర్ణించారు.ఏక కాలంలో 5.61 లక్షల పై చిలుకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసి రాష్ట్ర జనాభాలో 80% నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చెస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణా నిలిచిందని ఆయన తెలిపారు. సోమవారం సాయంత్రం సూర్యపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మందుల సామ్యోల్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను అందజేస్తామని,కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఆహార భద్రతకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పెద్ద పీట వేయడంతో పాటు యూ.పి.ఏ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక చట్టాన్ని రూపొందని ఆయన గుర్తుచేశారు.అధినేత్రి సోనియాగాంధీ ఆలోచనా విదానాన్ని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అమలులోకి తెచ్చామన్నారు.పదేళ్ల బి.ఆర్ ఎస్ పాలనలో అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయక పోగా కనీసంలో కనీసం అప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డులలో కొత్త సబ్యులను చేర్పించ లేకపోయారని ఆయన మండిపడ్డారు.కాకపోతే ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాత్రం తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు తెరలేపి బి.ఆర్.ఎస్ పాలకులు లబ్ది పొందారని ఆయన విమర్శించారు.తద్వారా లక్షలాదిమంది పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన చెప్పారు.అటువంటి పరిస్థితులను అధిగమించి రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తడవుగా అర్హులైన నిరుపేదలకు కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు అప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులను చేర్పించే ప్రక్రియ చేపట్టామన్నారు.11 సంవత్సరాల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు వంటి విపలవాత్మకమైన నిర్ణయం తీసుకున్న మీదట రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లకు చేరుకుందన్నారు.తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ రాష్ట్రంలో మహత్తరమైన మార్పుకు సంకేతంగా నిలిచి పోతుందాన్నారు.ఏక కాలంలో 5.6 లక్షల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు రాష్ట్ర జనాభాలో 80% పై చిలుకు జనాభాకు ఒక్కో వ్యక్తికి ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది ఏకైక తెలంగాణా రాష్ట్రం మాత్రమే నని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకీ వచ్చినప్పుడు పౌర సరఫరాల శాఖా పూర్తిగా అప్పుల సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు.పౌర సరఫరాల శాఖా 59,000 వేల కోట్ల అప్పులతో 11,000 వేల కోట్ల నష్టాలతో అఘామాఘంగా పౌర సరఫరాల శాఖ మిగిలి పోయిందన్నారు.అటువంటి పరిస్థితిలలో అధికారంలోకి వచ్చిన తాము పౌర సరఫరాల శాఖను స్థిరకరించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.అధికారంలోకి వచ్చిన 18 నెలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో శాఖా పూర్వస్థితికి వచ్చిందన్నారు.గడిచిన ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు ఇష్ట పడక పోవడంతో పక్కదోవ పట్టి అనేక అక్రమాలకు తెర లేచాయన్నారుఅటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యయనం చేసి నిరుపేదలకు కడుపు నిండేలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.సాలీనా 13,000 కోట్లు ఖర్చు పెట్టి పేద ప్రజలందరికీ సన్న బియ్యం అందిస్తున్నామన్నారు.అదే సమయంలో సన్న బియ్యం పంపిణీకి సరిపడా ధాన్యం ఉత్పత్తికి గాను ముందెన్నడూ లేని రీతిలో 500 బోనస్ ఇచ్చి మరీ సన్నాలను ప్రోత్సాహించామన్నారు.అదే సమయంలో రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలతో రాష్ట్రంలో రికార్డ్ స్థాయి ధాన్యం దిగుబడి నమోదు చేసుకుందన్నారు.దేశచరిత్రలోనే 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణా రికార్డు సృష్టించిందన్నారు.

