ముద్ర, జగిత్యాల టౌన్: జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రూ.15 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుధవారం భూమి పూజ చేసారు. అలాగే పోచమ్మ ఎల్లమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇందిర మహిళ శక్తి సంబరాలలో పాల్గొన్నారు. అనంతరం బాలపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఎమ్మార్వో శ్రీనివాస్, డిఈ మిలింద్, సీనియర్ నాయకులు సుధాకర్, నక్కల రవీందర్ రెడ్డి, గడ్డంనారాయణరెడ్డి, రౌతు గంగాధర్, చిర్రా నరేష్, సిడిపిఓ మమత, ఏఈ రాజమల్లయ్య, ఏపిఎం గంగాధర్, గుంటి రవి, గంగారెడ్డి , కడ మహేష్, నాగిరెడ్డి గంగారెడ్డి, నక్క హరీష్, ఆరే రవి, మధుసూదన్ రెడ్డి, అధికారులు మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.