Take a fresh look at your lifestyle.

మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

ముద్ర, జగిత్యాల టౌన్: రాష్ట్రంలోని మహిళల అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం లో భాగంగా రూ.200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలు రూ.6680కోట్ల ప్రయాణ ఛార్జీలు అదా చేసుకున్న సందర్భంగా జగిత్యాల కొత్త బస్టాండ్ లో బుధవారం సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొని మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహాలక్ష్మి పథకం లో భాగంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి, ఉత్తమ ప్రయాణికులను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో డి ఎం కల్పన, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్, నాయకులు అడువల లక్ష్మణ్, సుధాకర్ రావు, చేట్పల్లి సుధాకర్, వేణు,శరత్ రావు, పోతునుక మహేష్, రంగు మహేష్, ప్రవీణ్ రావు, సత్తవ్వ, సంకే మహేష్, హైర్ బస్ అసోసియేషన్ సభ్యులు, అర్టిసి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.