Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యల పై సిపిఐ పోరాటం. -సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. యేసు రత్నం.

సిపిఐ నిరసన దీక్ష.- సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్.

ముద్ర, కుత్బుల్లాపూర్ :
జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ప్రజా సమస్యల పై పోరాటం అనే నినాదంతో ప్రగతి నగర్ సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ నిరసన దీక్షను పాలభిందెల శ్రీనివాస్, పొన్నకంటి దస్తగిరి తో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు చేయించగా ముఖ్య అధితిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. యేసు రత్నం హాజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రజా సమస్యల పై సిపిఐ పోరాటం అనే నినాదంతో నిరసన దీక్ష నిర్వహించము అని తెలిపారు. నిజాంపేట్ సర్కిల్లో అంబీర్ చెరువు, తూర్క చెరువు, బైన్ చెరువు, పాపయ్య కుంట, కొత్త కుంట మొదలైన వాటిలో గుర్రపు డెక్కలు పెరగడం వల్ల వాటిని ఆసరా చేసుకొని దోమలు విపరీతంగా ప్రజల పై దాడి చేస్తున్నాయి అని గుర్తు చేశారు. కనుక ముందు గుర్రపు డెక్కలను తొలగించి తరువాత దోమలను నివారించాలి అని అన్నారు. అలాగే నిజాంపేట్ సర్కిల్ పరిధిలో రోడ్లు , డ్రైనేజ్ పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడం చాలా బాధాకరం అని దాని వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది అని అన్నారు. కనుక వెంటనే రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి అని అన్నారు. బస్తీ దావఖానాలలో డాక్టర్లు, నర్సుల కొరత వల్ల నిరూపయోగముగా వున్నాయి అని వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనీ వారు డిమాండ్ చేశారు. ఎండ కాలం వచ్చింది కనుక ప్రజలకు మంచి నీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తొంబై శాతం అక్షరాస్యత గల నిజాంపేట్ సర్కిల్లో గ్రంధాలయం లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. గ్రామపంచాయితీగా ఉన్న నాటి నుండి ప్రతి సంవత్సరం ఇంటి పన్నులో గ్రంధాలయనికి పన్ను కట్టుకునే ప్రభుత్వాలు, అధికారులు ముక్కు పిండి పన్ను వసూలు చేశారు తప్ప గ్రంధాలయం కట్టాలని ఆలోచించలేదు అని గుర్తు చేశారు. కనుక వెంటనే గ్రంధాలయం ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. అలాగే జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలనీ, బాచుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయనికి నలుగురు ప్రజల సమస్యలను చెప్పుకోవడానికి వెళ్తే కనీసం కూర్చోడానికి స్థలం లేక పాత బాచుపల్లి గ్రామపంచాయితీ కార్యాలయని వాడుతున్నారు. కనుక వెంటనే తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. అలాగే నిజాంపేట్ సర్కిల్లో పని చేసే మున్సిపల్ కార్మికుల, చెత్త బండి నడిపే కార్మికుల, చిరు వ్యాపారుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనీ వారు డిమాండ్ చేశారు. వెంటనే పై సమస్యలు పరిష్కారం చేయకపోతే నిజాంపేట్ సర్కిల్, రెవిన్యూ కార్యాలయాలు ముట్టడి చేస్తాము అని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డు గ్రహీత మేకల. నాగేష్, సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు జీ.కృష్ణ, ఆశి. యాదయ్య, బ్రహ్మానందం, కేశవులు, ప్రకాష్ , నాగేష్, శివ, కృష్ణ, గంగన్న, పి. సింధూరి, పి. కవిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.