- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ జిల్లాలో నిర్వహించిన యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం సైఫాబాద్‌లోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ (కేంద్రం కోడ్ 95), 123 దృష్టి వైకల్యం గల అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించి హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా యూపీఎస్‌సీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలను సందర్శించి అందులో రెండు విభాగాలు పరిశీలించారు.కళాశాల లో ఏర్పాట్లను, హాజరు శాతాన్ని తెలుసుకుని పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహణ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మొత్తం 43,676 మంది కాగా మొదటి సెషన్స్ లో 26,032 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 17,644 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని చెప్పారు.రెండో సెషన్స్ లో 25,787 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 17,889 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు కలెక్టర్ బషీర్‌బాగ్‌లోని ఓయూ పీజీ కాలేజ్ ఆఫ్ లాలో ఉదయం, మధ్యాహ్నం సెషన్స్ స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించి రూట్స్ లా వారీగా ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ షీట్లను ప్యాకింగ్ బండల్స్ తీసుకెళ్లే వాహనాలను పరిశీలించారు. పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా కేంద్రాల్లో చేరుకునే విదంగా చూడాలని పోలీస్, సంబంధిత అధికారులను ఆదేశించారు.
