ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:
సిద్దిపేట రూరల్ మండలం రావురూకల గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన కుపిరాల మణెమ్మ – భూధయ్య దంపతుల కుమార్తె జయశ్రీ వివాహానికి 38వ వార్డ్ మాజీ కౌన్సిలర్, బి ఆర్ ఎస్ నాయకులు దంపతులు ధర్మవరం స్వప్న – బ్రహ్మం పుస్తె, మట్టెలను అందజేసి తమ సహృదయాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ధర్మవరం బ్రహ్మం మాట్లాడుతూ, పేద ఆడపిల్లల వివాహాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. సమాజ సేవలో భాగంగా అవసరమైన వారికి చేయూత అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
మంచి మనసుతో తమ వంతు సహాయం అందించిన స్వప్న – బ్రహ్మం దంపతులకు
మణెమ్మ, భూదయ్యలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెళ్లి కుమార్తె సోదరుడు బాణుకుమార్ పాల్గొన్నారు.