Take a fresh look at your lifestyle.

కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ రాస్తారోకో

 

ముద్ర, కోరుట్ల;
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడిని ఖండిస్తూ వేములవాడ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదేశాల మేరకు శుక్రవారం రోజు కథలాపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల మాజీ ఎంపిటిసి మామిడిపల్లి రవి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం భూమారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్ రావు, మాజీ వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, సర్పంచులు గ్రామ మండల స్థాయి వివిధ హోదా లో ఉన్న తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.