కోరుట్ల, ముద్ర: 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న కెపిఏస్ హై స్కూల్ విద్యార్థుల కోసం శనివారం రోజు “స్పెక్ట్రోపీ ఏడు టెక్” ఆధ్వర్యంలో ఐఐటీ–నీట్ ప్రాతిపదిక పరీక్షను ఆన్‌లైన్లో విజయవంతంగా నిర్వహించారు.ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షల నమూనాలను ముందుగానే పరిచయం చేయడం,వారి అకడమిక్ స్థాయిని పటిష్టం చేయడం ప్రధాన ఉద్దేశం టాబ్లెట్లు ఉపయోగించి నిర్వహించిన ఈ డిజిటల్ పరీక్ష విద్యార్థులకు సాంకేతికతతో కూడిన ఆధునిక అనుభవాన్ని అందించింది.కెపిఎస్ లో గత 7 సంవత్సరాల నుండి ఐఐటీ-నీట్ ఫౌండేషన్ కోర్సులు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు,వచ్చే విద్యా సంవత్సరo నుండి ఈ ఫౌండేషన్ కోర్సులను 10వ తరగతి వరకు విస్తరించబోతున్నామని అన్నారు.ఐఐటీ ఫౌండేషన్ విద్యను నూతన మార్గాల్లో అభివృద్ధి చేసి, విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచే దిశగా ముందడుగు వేస్తామని కోరుట్ల పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గుజ్జేటి వెంకటేష్ తెలియజేశారు.