Take a fresh look at your lifestyle.

ఉప్పల్ అభివృద్ధికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తా-ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర కాప్రా

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ అభివృద్ధి కోసం శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు.
సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో సరస్వతీ నగర్ కాలనీలోని ఖాళీ స్థలంలో వాకర్స్ కొరకు ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ బుధవారం స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తో కలిసి ప్రారంభించారు. దీనితోపాటు ఒక స్టోర్ రూమ్ నిర్మించడం జరిగింది. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీలలో అవసరమైన అభివృద్ధి పనులను అధికారులతో సంప్రదించి పూర్తి చేస్తానని తెలిపారు.స్థానికుల కోరిక మేరకు తొందర్లోనే ఇందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఈ. ఉమామహేశ్వరి ఎఈ సూరజ్ వర్క్ ఇన్స్పెక్టర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ,బాపూజీ నగర్ సరస్వతి నగర్ కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నెరవేరిన కోరిక – రామంతాపూర్‌కు పోలీస్ స్టేషన్

రామంతాపూర్ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరింది.రామంతాపూర్‌లో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావడం ద్వారా ప్రజలకు మరింత భద్రత, సత్వర న్యాయం అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రామంతాపూర్ పోలీస్ స్టేషన్ ప్రారంభంతో శాంతిభద్రతలు మరింత మెరుగుపడతాయని, ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
ప్రాంత అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.