Take a fresh look at your lifestyle.

ఎర్రవల్లిలో గోటి తలంబ్రాల మహోత్సవం – భక్తులు భారీగా పాల్గొనాలి : రామకోటి రామరాజు

ఎర్రవల్లిలో జరిగే గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొనండి

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

గోటి తలంబ్రాలలో పాల్గొనడం ఎన్ని జన్మల పుణ్యమో

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

శ్రీరామనవమి న భద్రాచల సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన తలంబ్రాలె వాడుతారు. ఈ తలంబ్రాలు దీక్ష కార్యక్రమం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభం అవుతుందని ఈ కార్యక్రమంలో కలశాలతో వందలాది భక్తులు పాల్గొంటారన్నారు. 4వ సారి 3క్వింటాల్ల గోటి తలంబ్రాలు కల్యానానికి అందించే భాగ్యం కలిగిందని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం హనుమాన్ దేవాలయంలో సమావేశం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇతర గ్రామాల భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. కోటి తలంబ్రాల దీక్ష శనివారం భారీ ఎత్తున ప్రారంభమౌతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ఈ అవకాశం కలగజెస్తానన్నారు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో స్త్రీ, పురుష లింగ బేధం లేకుండా అందరు పాల్గొనాలన్నారు. మనము లేకున్నా మనం ఓలిచే తలంబ్రాలు కళ్యాణంలో ఉంటే బహు పుణ్యం అన్నారు. గోటి తలంబ్రాల్లో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని ఇంతటి అదృష్టాన్ని మాకు కల్గజేస్తున్న రామకోటి రామరాజుకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచు నారన్నగారి కవిత, మహిపాల్ రెడ్డి, రాజిరెడ్డి, పాండరి, నర్సింహారెడ్డి, గోవర్ధనరెడ్డి, రామస్వామి, నరేష్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.