ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కామారెడ్డి పర్యటనకు ముందు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఒక శాసన సభ్యునిగా, బీజేఎల్పీ నేత గా తనకు పర్యటించే అధికారం ఉందని, తనను గృహ నిర్బంధం చేయటం ఏమిటని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారిని ప్రశ్నించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను అరెస్టు చేయటం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అభద్రతా భావంతో ఉందో బహిర్గతం అవుతుందని ఆయన అన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో అడ్డుకోలేరని, ప్రశ్నించే గొంతుకను చూసి ఎందుకు ఇంత భయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
