Take a fresh look at your lifestyle.

18న ‘ఇందిరా గిరి జల సౌర వికాసం’

  • ప్రజా ప్రభుత్వం ఉండొద్దని బీఆర్ఎస్ కుట్రలు.
  • గత పదేండ్ల దోపిడీయే నేడు సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకి.
  • రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం జాప్యానికి అదే కారణం.
  • గిరిజన మహిళ రైతులను చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది.
  • ఈనెల 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా గిరి జల సౌర వికాసం ప్రారంభం.
  • గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇల్లు.
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ముద్ర, తెలంగాణ బ్యూరో : వినూత్న పథకాలతో సంక్షేమానికి పెద్దపీట వేస్తోన్న ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండొద్దని ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.బీఆర్ఎస్ కుట్రను ప్రజలందరూ గమనించాలని కోరారు. మంగళవారం మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి లో ఇందిరమ్మ విగ్రహం ఆవిష్కరణ సభ, మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని లక్ష్మీ నరసింహపురం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా రూ. వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు.ధనిక రాష్ట్రాన్ని గత పాలకుల చేతిలో పెడితే పదేళ్లు పాలించిన వారు ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఆనాడు వారు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును గత పాలకులు దోచుకోవడంతోనే నేడు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న రైతు రుణమాఫీ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా పోయాయి అన్నారు.గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వివరించారు.అటవీ హక్కుల చట్టం కింద కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు పొందిన గిరిజన రైతులు సాగు చేసుకునేందుకు వెళితే.. మహిళలని చూడకుండా గత పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం చెట్టుకు కట్టేసి కొట్టింది అన్నారు. గిరిజన రైతులకు భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ఈనెల 18న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట లోని చెంచు కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించబోతున్నాం అని వివరించారు.ఈ పథకం కింద 12,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు గిరిజనులకు ఆదాయం వచ్చేలా ఉద్యానవన శాఖతో ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు.ఈ పథకం కింద ప్రతి గిరిజన రైతుకు సోలార్ విద్యుత్ పంపుసెట్టు, స్ప్రింక్లర్లు, అవకాడో, పామ్ ఆయిల్ వంటి మొక్కలు ఉచితంగా అందజేస్తాం అన్నారు.ప్రత్యేక రాష్ట్రం వస్తే మన జీవితాలు మెరుగవుతాయి, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతుందని పోరాటం చేశామని గుర్తు చేశారు.వనరులు, ఆర్థిక సంపద తెలంగాణ ప్రాంత ప్రజలు వాడుకుంటే వారికి మేలు జరుగుతుందని సోనియాగాంధీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసిందని అన్నారు.ధనిక రాష్ట్రాన్ని వారి చేతికి అప్పగిస్తే 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు అన్నారు. పదేళ్ల కాలంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు, ఏ ఒక్క దళితునికి మూడెకరాల భూమి పంపిణీ చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, ప్రతి మండలంలో కేజీ టు పీజీ పాఠశాలలో నెలకొల్పుతామన్నారు దాన్ని పక్కన పడేశారు. రూ.7 లక్షల కోట్ల అప్పుచేసి ఒక పెద్ద పరిశ్రమ, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ వంటి ఒక భారీ నీటి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదన్నారు. రాష్ట్ర సొమ్ము కాజేసి దివాలా తీయించి బ్యాంకులకు రాష్ట్రాన్ని కుదరపెట్టి తగుదునమ్మ అంటూ కేసిఆర్ కుటుంబం మాట్లాడుతుందని విమర్శించారు. ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ నిరంతరం కృషి చేస్తుంది అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాం. 22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నాం, గిరిజన నియోజకవర్గాల్లో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ పథకం దేశ చరిత్రలోనే ఓ రికార్డు అన్నారు.ఇంటికో ఉద్యోగం అని 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారు కానీ మేం అధికారంలోకి రాగానే సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించాం, ఏడాదిన్నర కాలంలో 57, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసాం మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం అనే స్వయం ఉపాధి పథకాన్ని తీసుకు వచ్చాం. 5 లక్షల మంది నిరుద్యోగులు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నాం.జూన్ 2న నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్లు అందజేస్తాం అన్నారు.పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ నిరుద్యోగ యువత గురించి ఎందుకు ఆలోచించలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.కేకెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి వంటి ఏ పథకాన్ని ఆపలేదు రైతు భరోసా పథకానికి మరో రెండు వేలు అదనంగా జోడించి అందజేస్తున్నామన్నారు.రూ.లక్ష రుణమాఫీనీ కేసిఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు చేయలేకపోయిందన్నారు.అదే ప్రజా ప్రభుత్వం రూ.రెండు లక్షల రుణమాఫీని మొదటి ఏడాదిలోనే అమలు చేసిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ కోసం రూ. 21,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.రూ. 13వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతినెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళలు రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, గుడికి, లేదా పిల్లల బడికి వెళ్లేందుకు ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందన్నారు.అయితే మహిళలు తిరగొద్దు ఉచిత బస్సు ప్రయాణం బాగాలేదని సీఎం కేసీఆర్ అంటున్నారని తెలిపారు.పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అన్నారు. 200 యూనిట్ల లోపు వాడుకునేవారికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం అందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో 80 నుంచి 90 శాతం మంది కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది అన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తూ వారి తరఫున 12,500 కోట్ల రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది అన్నారు.కెసిఆర్ 10 ఏళ్లపాటు నీటిపారుదల ప్రాజెక్టులను గాలికి వదిలేస్తే మేము రాగానే ఆరు నెలల్లో పూర్తి అయ్యేవి, మూడు సంవత్సరాల్లో పూర్తి అయ్యేవి గుర్తించి నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసే పనిలో పడ్డాం అన్నారు.రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు.

  • సంక్షేమం అంటేనే ఇందిరమ్మ :

సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఆమె రాజ్యంలోనే 20 సూత్రాల పథకం ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని డిప్యూటీ సీఎం అన్నారు.ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు భూముల పంపిణీ, బ్యాంకుల జాతీయకరణ జరిగాయని వివరించారు.ఇందిరమ్మ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అన్నారు.ఇందిరమ్మ పేరిట ప్రభుత్వం తీసుకొస్తామని ఎన్నికల ముందు మేము చెప్పిన మాటను విశ్వసించి తమను ఆశీర్వదించి అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవానికి రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ పథకం గురించి తాము ప్రకటించిన మొదట్లో ఇది సాధ్యమా అని హేళనగా మాట్లాడారన్న భట్టి నేడు తాము ఇందిరమ్మ ఇల్లు కట్టి చూపిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు రూ. 22,500 కోట్ల వ్యయం చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు 25 ఎకరాల్లో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క పాఠశాల నిర్మిస్తున్నట్టు తెలిపారు.దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో మూడున్నర లక్షలకు పైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన రైతులను ఇబ్బందుల పాలు చేసిందని మండిపడ్డారు.గిరిజన రైతులకు భరోసా ఇచ్చేందుకు ఈనెల 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.