ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సమాచార ఆర్టీఐ కమిషనర్లుగా నియమితులైన నలుగురు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.నూతన సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, మొహిసినా పర్వీన్ కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువలు కప్పి పుష్పగుచ్చం అందజేశారు.
