Take a fresh look at your lifestyle.

వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

పరమశివునికి మహానంది స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు..

బిజినపల్లి మండల పరిధిలోని నందివడ్డేమాన్  గ్రామంలో వెలిసిన శ్రీజేస్టా మాత సమేత శనీశ్వర స్వామి దేవాలయ 26వ వార్షికోత్సవంలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక పూజలు నవగ్రహ పూజలు నిర్వహించారు.బ్రహ్మసూత్రము గల పరమశివునికి విశేషంగా మహన్యాస పూర్వకంగా రుద్ర అభిషేకాలు విశేష ద్రవ్యాలతో నిర్వహించారు.మహానందీశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేక పూజలు చేశారు. సాయంత్రం సమయంలో ఆలయ చైర్మన్ గోపాలరావు దంపతులు,కంచే రాజేష్ దంపతులు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు చేశారు. అనంతరం పాల్గొన్న భక్తులందరికీ ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమటం విశ్వనాథ శాస్త్రి,ఆలయ అర్చకులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.