Take a fresh look at your lifestyle.

ఘనంగా మండల విద్యాధికారి వీడ్కోలు సమావేశం – హాజరైన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి 

 

 

 ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిగా సుదీర్ఘకాలం సేవలందిస్తూ ఈ రోజు పదవి విరమణ పొందిన వెంకటయ్య గారి ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. మండల విద్యాధికారిగా, ఉపాధ్యాయుడిగా తాండూర్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం

విద్య అభివృద్ధికీ కృషి చేస్తూ ఎంతో మంది పేద విద్యార్థుల ఉన్నతికీ కృషి చేయడం జరిగిందని,అదే విధంగా

విద్యా రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు, విధి నిర్వహణలో వెంకటయ్య గారి అంకితభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు

పదవి విరమణ అనంతరం కూడా సమాజానికి తన అనుభవంతో సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మర్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు గారితో  పట్టణ కౌన్సిలర్స్, నాయకులు పలువురు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.