బోథ్, ముద్ర:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి రానున్న నేపథ్యంలో సభ స్థలాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ లు పరిశీలించారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించి బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. సభావేదిక, పార్కింగ్ స్థలం, సభ స్థలికి వచ్చే మార్గాలు, సభకు వచ్చే ప్రజలకు కల్పించే సౌకర్యాలపై చర్చించుకున్నారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఇచ్చోడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యవతి కోటేశ్వర్,నాయకులు అశ్విన్ రెడ్డి,మండల అధ్యక్షుడు జెల్కే పాండురంగ్ జిల్లా నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్లు,నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.