Take a fresh look at your lifestyle.

తెలంగాణ రైజింగ్ విజన్ తో పాలన : మంత్రి కోమటిరెడ్డి

ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రీజినల్ రింగ్ రోడ్డు మా గేమ్ చేంజర్

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047”అనే స్పష్టమైన విజన్‌తో పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో ఏస్ టెక్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 5.75లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు తమ ప్రభుత్వం గేమ్ చేంజర్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు 39 రేడియల్ రోడ్లు నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. ఐటీ, ఫార్మా, ఏఐ లాంటి పోటీ రంగాలను ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి… హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోందని వెల్లడించారు. హైదరాబాద్ అన్ని రంగాల్లో పురోగమిస్తోంది.. రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన వేలం పాటలో ఎకరం ధర రూ. 174కోట్లు పలికిందని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎటు చూసినా హై రైజ్ భవనాలు కనిపిస్తాయని తెలిపారు. “మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు అందుబాటు ధరలో సొంతింటి కల నెరవేర్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు.. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో సమానంగా అభివృద్ది చేస్తూ…పరిశ్రమల స్థాపన..ఉపాధి కల్పన అంశాలపై ప్రధాన దృష్టి సారించినట్లు వెల్లడించారు.. పొల్యూషన్ ఫ్రీ సిటీ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.