Take a fresh look at your lifestyle.

కొత్త పథకాలతో మోసాలకు కుట్ర..

  • యువజన డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు.
  • జాబు క్యాలెండర్ అమలు చేయాలి.
  • బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి మోసం చేసేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు కుట్రలు చేస్తుందని బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి విరుచుక పడ్డారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం నర అవుతున్న ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.యువజన డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు ప్రభుత్వ హామీలను ప్రకటనలకే పరిమితమయ్యాయని రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని మహిళలకు పోటీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.యువ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా ప్రతి ఒక్కరికి పది లక్షల రుణాలను చెల్లించాలని జాబు క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నియోజకవర్గంలో కొనసాగుతున్న అప్రజాస్మిక పాలనపై పోరాటాలకు వెనుకడుగు వేసేది లేదని అన్నారు ఈ సమావేశంలో అర్థం రవి లక్ష్మయ్య సుల్తాన్ విష్ణు దామోదర్ భీముడుఅహ్మద్ అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.