- శ్రీ వైద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన.
మంథని, ముద్ర విలేకరి : మంథని మండలం గోపాల్ పూర్ గ్రామంలో దికొండ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.శ్రీ వైద్య ఫౌండేషన్ సహకారంతో గ్రామస్తులకు షుగర్,బీపీ రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేశారు. అలాగే కరీంనగర్ సన్ రైస్ ఆసుపత్రి వైద్య సిబ్బంది గ్రామస్తులకు ఉచితంగా గుండె పరీక్షలు, మంథని లోని పటేల్ ఐ కేర్ ఆస్పత్రి వారు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తామని పేర్కొన్నారు.నిరుపేద ప్రజల ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న, శ్రీ వైద్య ఫౌండేషన్, అలాగే సన్ రైస్ ఆసుపత్రి యాజమాన్యానికి దికొండ లక్ష్మణ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ వైద్య ఫౌండేషన్ చైర్మన్ బుద్ధార్తి సతీష్ కుమార్,దికొండ లక్ష్మణ్ ,సన్ రైస్ ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ రాజేందర్, మార్కెటింగ్ ఎక్క్యూటివ్ తిరుపతి, డాక్టర్ వెంకటేష్, ఆసుపత్రి మార్కెటింగ్ కోఆర్డినేటర్స్ సతీష్, ఫార్మసిస్ట్ నర్సింగ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.