Take a fresh look at your lifestyle.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకారం

 

ముద్ర మల్కాజిగిరి

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కార్పొరేషన్ ఆర్థిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతానని తెలిపారు. నగర అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
అనంతరం ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజిగిరి అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.