Take a fresh look at your lifestyle.

స్వర్ణగిరి లో వైభవంగా సీతారామ కళ్యాణం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరిలో శ్రీ రామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి శ్రీ వారి వైభవోత్సవ మంటపంలో కొలువుదీర్చారు. ముందుగా పుణ్యహవచనం చేశారు. అనంతరం రక్షాబంధనం యజ్ఞ ఉపవీత ధారణ చేసి గోత్ర ప్రవరలు పఠించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సర్పించారు.
అనంతరం భక్తుల గోవింద నామ స్మరణల నడుమ మాంగళ్య ధారణ గావించారు. స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు పోసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులకు వడపప్పు పానకం విశేష అన్న ప్రసాదం అందచేశారు.

Leave A Reply

Your email address will not be published.