Take a fresh look at your lifestyle.

ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు తో పేద విద్యార్థులకు ఉచిత విద్య

  • కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలు, బాధలను అర్థం చేసుకొని ప్రజా పాలనను చేపట్టడం జరుగుతోంది.
  • రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.
  • వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన.
  • శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కరించడం ప్రజా ప్రతినిధి లక్ష్యం, లక్షణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ధి శంకుస్థాపనలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాండూరు పట్టణానికి సమీపంలోని కందనెల్లి జిపిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన సభలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ…. ప్రజా సమస్యలు, బాధలను అర్థం చేసుకొని ప్రజా పాలనను చేపట్టడం జరుగుతుందన్నారు. గత పది సంవత్సరాల్లో చేపట్టని పనులన్నింటిని పెద్ద మొత్తంలో నిధులను కేటాయించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇంకా భవిష్యత్తులో అధిక నిధులను కేటాయిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డు లేని అర్హులైన పేదవారికి కార్డులను అందిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల కుటుంబాలకు గాను 95 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణాల నిమిత్తం ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 మంజూరు చేస్తూ, ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుడికి రూ. 5 లక్షల చొప్పున నగదు జమ చేయడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి వైద్య సదుపాయి నిమిత్తం ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలను అందించడం జరుగుతుంది ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా 25 ఎకరాల్లో రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి పాఠశాలలు భవిష్యత్తు తరాలకు ఎంతగానో దోదపడుతుందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నిన్నేం తీసుకుందని ఆయన అన్నారు. జనాభాలో సగభాగమైన మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందజేయడం జరుగుతుందని, ఒక సంవత్సరంలోనే 21 వేల కోట్ల రుణాలను అందించిన ఘనత ప్రజాపాల ప్రభుత్వందని ఆయన తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా మహిళలకు ఆర్టీసీల్లో బస్సులను అద్దెకివ్వడం, సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం మహిళలకు తోడ్పాటు అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రైతుల పక్షపాతిగా రైతుల బాధలను తెలుసుకున్న ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలతో ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. వసతి గృహాల్లో మెస్ చార్జీలను పెంచి నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు వసతి గృహాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.లో వోల్టేజ్ ని అధిగమించేందుకు గాను రాష్ట్రంలో అవసరానున్న ప్రాంతంలో విద్యుత్తు సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జనాభా ప్రాతిపదికన బహుజనుల రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు.శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ .ల్తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.గత ముఖ్యమంత్రి పదేళ్ళలో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇప్పుడు దానికి నెలకు ఆరు వేల 500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. అప్పులకు వాయిదాలు, వడ్డీలు కడ్తూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల లోపు కరంటు వాడుకునే పేదల కుటుంబాలకు ఉచిత కరంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు మంజూరు ఇలా పేదలకు మేలు జరిగే పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటికే జిల్లాలో పంచాయితీ రాజ్ , ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా పనులు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగాకోట్ పల్లి ప్రాజెక్టు అభివృద్ధి కోసం రూ .90 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయనీ అని తెలిపారు.పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… సంక్షేమ కార్యక్రమాలు పొందేందుకు రేషన్ కార్డు ఎంతగానో దోదపడుతుందన్నారు. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న రకం బియ్యం పొద్దు తారని, దీనివల్ల ఎంతమంది పేదలు లబ్ధి పొందుతారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అరుడైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 75 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు రుణమాఫీని చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వికారాబాద్ నుండి తాండూర్ వరకు రూ . 63 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలకు నాంది పలకడం జరిగిందని మంత్రి సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఆయన తెలిపారు.మహిళా సంక్షేమం కోసం ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.వికారాబాద్ జిల్లాలో కొత్తగా 22,503 రేషన్ కార్డులు ఇస్తూ 71 వేల మందికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. తాండూర్ నియోజకవర్గం లో కొత్తగా 7,043 కార్డులు మంజూరు కాగా దీనితో 22,292 మంది కి లబ్ధి చేకూరుతుంది.ఇలా బషీరాబాద్ లో 706, పెద్దెముల్ లో 1939, తాండూరు మండలం మరియు మున్సిపల్ లో 3315,యాలాలలో 1083 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, డిసిసిబి చైర్మన్ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.