Take a fresh look at your lifestyle.

చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

  • సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి మత్యంరావు.

మంథని, ముద్ర విలేకరి :మంథని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు రావలసిన సబ్బులు,నూనెలు, చెప్పులు,దుస్తులు కొన్ని సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నాయని అనేక సంవత్సరాలుగా ఎన్ఎంఆర్ కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని వీరిని మున్సిపాలిటీ కాంటాక్ట్ కార్మికులతో సమానంగా కాంటాక్ట్ పద్ధతిలో విలీనం చేయాలని ఇంకా ఇతర సమస్యలను పరిష్కరించాలని ఈనెల 19న మంథని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల వేతనాలను పెంచుతామని హామీ ఇచారు. ఇచ్చిన హామీని అమలు చేసి మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఎనిమిది గంటల పని దినాలను 10 గంటల పని దినాలుగా మార్చిన జీవో నెంబర్ 252 ను ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈనెల 23న హైదరాబాదులోని మున్సిపల్ సిఎండి కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్,మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సింగారపు గట్టయ్య,చిప్పకుర్తి చందు,ఎడ్లపల్లి రాజయ్య, జంపయ్య, సమ్మయ్య, భాగ్య, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.