- చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
మాదాపూర్, ముద్ర విలేఖరి : శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన భూ భారతి చట్టం – 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో రాజేంద్రనగర్ వెంకట్ రెడ్డి శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్, జగదీశ్వర్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూ భారతి – కొత్త ఆర్ ఓ ఆర్ చట్టమని అందులో భాగంగా భూమి హక్కులు భద్రం భూ సమస్యల సత్వర పరిష్కారం. రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు అని పేర్కొన్నారు.భూ భారతి చట్టం రైతుల చుట్టమని అన్నారు. రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు కోసం ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం భూధార్ కార్డుల జారీ చేస్తుందని, రైతులకు ఉచిత న్యాయ సహాయం చేసే విధంగా వెసులుబాటు కల్పిస్తుందని గాంధీ తెలియచేసారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి నూతన ఆర్ ఓ ఆర్ చట్టం 2025 లో పొందుపరిచిన అంశాలు రైతుల సమస్యల పరిష్కారానికి ఎంతో మేలు చేస్థాయి అని, భూమి అనేది ఒక రైతు జీవితానికి చాలా పెద్ద ఆధారమని, ముఖ్యంగా భూ భారతి చట్టంలో అప్పీలు వ్యవస్థ చాలా కీలకమైనది అని, రైతు కు ఒక వేళ అన్యాయం జరిగితే అప్పీల్ చేసుకోవడం ద్వారా న్యాయాన్ని పొందవచ్చు అని, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ,సి సి ఎల్ ఏ స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చు అని,భూమి హక్కులను రక్షించడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని తెలంగాణ భూభారతి చట్టం ద్వార భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి అనుగుణంగా తీర్చిదిద్దామన్నారు. ఇకపై భూవివాదాలకు స్థానం లేకుండా భద్రమైన భూమి హక్కులు అందరికీ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని,ఈ చట్టంతో సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాలు సైతం భూభారతిలో పరిష్కారం చేసుకోవచ్చన్నారు.జూన్ నెల నుంచి తహసీల్దార్లు మండలంలోని ప్రతీ గ్రామంలో భూభారతి సదస్సులు నిర్వహించి రైతులకు భూసమస్యలపై అవగాహన కల్పించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు,రైతులు తమ భూములను ఆన్ లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు.గతంలో ఏవైనా భూ సమస్యలు వస్తే కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, భూ భారతితో 90శాతం తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని తెలిపారు,లేదంటే ఆర్డీవో, కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. భూసమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టం పై అవగాహనను ఏర్పరచుకోవాలని, దీనిని వూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ గాంధీ రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఆర్.ఐ చంద్రారెడ్డి, శ్రీనివాస్ ,అధికారులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
