మొయినాబాద్ ముద్ర విలేకరి : ఎవరో వస్తారు,ఎదో చేస్తారు అని ఆలోచన చేయడం మానేసి స్వయం ఉపాధి వైపు యువత మొగ్గు చూపాలని ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందవచ్చునని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మండలంలోని హిమాయత్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు బుర్రకాయల రమేష్ ముదిరాజ్ చిలుకూరు రెవెన్యూ పరిధిలో నూతనంగా లాండ్రీ(డ్రైక్లినింగ్) దుకాణాన్ని ఏర్పాటు చేయగా స్పీకర్ బుధవారం సాయంత్రం ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో కృషి చేస్తోందని అందుకు ఉదాహారణ రాజీవ్ యువ వికాస్ పథకామని తెలిపారు.ఎవరో వస్తారు, ఎదో చేస్తారు అని కాకుండా మనం స్వయం ఉపాధితో ముందుకు వెళ్తే ఆర్థికంగా బలోపేతమైతామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పామెన భీంభరత్, మండల పార్టీ అధ్యక్షుడు మాణయ్య తదితరులు పాల్గోన్నారు.