Take a fresh look at your lifestyle.

రెండున్నరేళ్ళు దాటిని పిల్లలని  అంగన్వాడీకీ పంపాలి

  • ఐసీడీఎస్ సూపర్ వైజర్ కవితా రాణి.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రెండన్నర ఏళ్ల నుండి 5 ఏళ్ల పిల్లలను అంగన్వాడీ స్కూల్ కు పంపించాలని ఐ సీ డీ ఎస్ సూపర్ వైజర్ కే.కవితా రాణి అన్నారు. అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ అంగన్వాడి కేంద్యంలో ప్రీ స్కూల్ విద్య ప్రాముఖ్యత గురించి సూపర్ వైజర్ వివరించారు.ఈ సందర్బంగా కవితరాణి మాట్లుడుతూ అంగన్వాడీ లో అందించే ఆటపాటలతో కూడిన విద్యా ప్రాముఖ్యత, వారి పోషకస్థితిని అంచనా వేయడం, విద్య బాధన చేయడం జరుగుతుందన్నారు. మంచి అలవాట్లు సృజనాత్మకత, బాషా అబివృద్ధి, బ్లాక్స్ ఫజిల్స్,నాటకీకరణ వంటి కార్నర్స్ ద్వారా వారిలో ఉన్న మేధాభివృద్ధికి కృషి చేస్తూ విద్య భోధన చేయడం జరుగుతుందన్నారు.అనంతరం కొత్తగా అంగన్వాడీ లో చేరిన పిల్లలకి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మాదేశి శిరీష, అంగన్వాడి టీచర్లు అరుణ, మధవి, ఆశా వర్కర్లు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.