బిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ను వాటర్ హబ్ గా మార్చడం జరిగిందని రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లో కురిక్యాల లో ఉన్న వరద కాలువని మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఇతర బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి వరద కాలువను పరిశీలించారు ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పుడున్న
ఈ నిముషానికి వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా అన్నారు. చొప్పదండి జగిత్యాల మెట్టుపల్లి, బాల్కొండ నియోజకవర్గం లకు కాళేశ్వరం తోనే నీళ్లు అందించామన్నారు. వరద కాలువలో నీళ్లు కాలేశ్వరం కాదా దీని పై పండిన పంట కాళేశ్వరం నీళ్లు కాదా అని హరీష్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రెండున్నర సంవత్సరాల నుండి రెండు రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల లోవి కాళేశ్వరం నీళ్లు కాని, మంత్రులు కాళేశ్వరందు అసత్య ప్రచారం చేస్తున్నారు.
వరద కాలువ క్రింద ఉండే రైతులకి మొక్క వేసుకుందామన్న నీరు లేని పరిస్థితి కాని కాళేశ్వరం నీళ్లతో వరద కాలువ క్రింద సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నారని అన్నారు. వరద కాలువను జీవ నదిగా మార్చినది కేసి ఆర్ ప్రభుత్వం అని తెలిపారు. 96% గౌరవెల్లి ప్రాజెక్ట్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్మించింది. రెండున్నర సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి మాటల చెప్పుడు తప్ప కొద్దిగా మట్టి తీసిన దాఖలాలు లేవు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.