Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే….

  • ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో బిజెపి ఆరంభం
  • ప్రధాని మోడీ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట పెరిగింది..రాజ్యాంగాన్ని 90 సార్లు మార్చినవారే ఆరోపణలు చేయడం ఏయామైనా చర్య..
  • చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి.

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బీజేపీ ప్రభుత్వమేనని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం సిద్దిపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రధానమంత్రి మోడీ విధానాలతో దేశం అంతర్జాతీయంగా పేరు పొందిందని చెప్పారు.అందుకే తెలంగాణ ప్రజలు మోడీ వైపు ఆలోచిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలుపుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రారంభమవుతుందని భీమా వ్యక్తం చేశారు.90 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నాయకులు బిజెపిపై విమర్శలు చేయడం హేయమైనచర్యగా వర్ణించారు.తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రజలు చెల్లించే పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాలు మున్సిపాలిటీలు కొనసాగుతున్న అన్నారు.సర్వ శిక్ష అభియాన్ తో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని,అందుకే ఎమ్మెల్సీలు గెలవగానే కేంద్ర ప్రభుత్వం బతకాల అన్నింటిని రాష్ట్రంలో అమలు చేయడం ఆ పథకాల ద్వారా పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తామన్నారు. సిద్దిపేట మెదక్ కరీంనగర్ ప్రాంతాలకు రైలు తీసుకొచ్చిన ఘనత బిజెపికి దక్కిందన్నారు.భవిష్యత్తులో బిజెపి దేశవ్యాప్తంగా అధికారం సాధించి దేశాన్ని సమున్నత స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనం అన్నారు.పేదల మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి,నాయకులు శ్రీకాంత్ రెడ్డి,రామచంద్రారెడ్డి,విద్యాసాగర్ రావు, విభీషణ్ రెడ్డి,నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.