- బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి నిమిషం ముఖ్యమే
- రాబోయే పదవ తరగతి పరీక్షల్లో అందరూ మంచి ఫలితాలు సాధించలే
(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్న కలను నిజం చేసేలా విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠవాలలో ఇన్స్పిర్,ఇగ్నిట్ పౌండేషన్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,విద్యార్థులను కష్టపడి చదివితే ఉజ్వల భవిషత్ ఉంటుందని అన్నారు. ఇన్స్పిర్, ఇగ్నిట్పౌండేషన్ ద్వారా మానవతా విలువలు ఆచరించబడతాయని అన్నారు. 327 గురుకులాల్లో మనలో ఉన్న అధైర్యం దూరం తొలి మనలో విశ్వాసాన్ని పెంచడానికి ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతయని అన్నారు.లక్ష్యం సాధించాలంటే దాని వెనుకలో ఎంత కష్టం ఉంటుందన్నారు.అబ్దుల్ కలాం కళాలు కని,వాటిని నిజం చేసుకోవాలన్నారని తెలిపారు.ప్రపంచ స్థాయిలో మంచి పేరు,ప్రఖ్యాతలు సాధించలంటే,మంచి డాక్టర్ కానీ ,ఇంజనీర్ కానీ, మంచి ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.అలాగే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మన దినచర్యను ప్రారంభించాలని,మన లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి నిమిష ముఖ్యమేనని అన్నారు.రాబోయే పదవ తరగతి పరీక్షల్లో అందరూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.విద్యా శాఖ అధికారులతో పాఠశాల ప్రిన్సిపల్ లతో హైదరాబాద్ ఇన్చార్జ్ మినిస్టర్ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ,ఇతర ఐఎస్ఐలు గురుకులాల్లో చదివి వచ్చిన వారేనని గుర్తుచేవారు.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని..అలాగే విద్యా రంగానికి సంబంధించి సౌకర్యాలు కల్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెస్ ఛార్జీలు పెంచామని తెలిపారు. తెలంగాణలో ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్న పాఠశాలలు విద్యార్థులకు మెస్ ఛార్జీలు సమయానికి పడేలా చూస్తున్నామని తెలిపారు. అనంతరం ఇన్స్పిర్, ఇగ్నిట్ పౌండేషన్ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి,మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రేస్ ఇంచార్జి కిచెన్నగారి లక్ష్మారెడ్డి, సీడబ్ల్యూ సభ్యులు గిడుగు రుద్రరాజు,మహజ్యోతి రావు పూలే గురుకులాల కార్యదర్శి సైదులు, గురుకులలా సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
