- జర్నలిస్టు లపై దాడులు జరుగుతే సహించం
- జర్నలిస్టుల పక్షాన నిబద్ధతతో పనిచేసేదే టీయూడబ్ల్యూజే
- రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్
ముద్ర ప్రతినిధి, వనపర్తి: నిఖాస్సయిన వార్తలు రాసి జర్నలిజం విలువలు కాపాడాలని..జర్నలిస్టుల సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేసే ఏకైక యూనియన్, అతిపెద్ద యూనియన్ టియు డబ్ల్యూ జే ఐజేయు మాత్రమేనని, జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చిన ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొని వెళ్లి యూనియన్ పరంగా ఆదుకొంటామని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్ అన్నారు. కొత్తకోట మండల కేంద్రంలోని QR ఫంక్షన్ హాల్లో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. జర్నలిస్ట్ సమాజానికి ఎలాంటి సమస్య ఉన్న వెంటనే స్పందించి గతంలో సహాయం చేసిన విషయాలను వివరిస్తూ..ఉమ్మడి మహెబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు యూనియన్ పరంగా ఆదుకొని వారి కుటుంబానికి పెన్షన్ సౌకర్యం కల్పించామని గుర్తు చేస్తూ..ఇటీవల చనిపోయిన మరో నల్గురు జర్నలిస్ట్ కుటుంబాలకు వీలైనంత తొందర్లో ఆదు కొంటామని, వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్ధిక సహాయాన్ని ఇప్పించి..వారి పిల్లలకు ఉచిత విద్యతో పాటు.. ప్రెస్ అకాడమి నుండి ప్రతి నెల వచ్చే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇస్తూ..భవిష్యత్తులో కూడా జర్నలిస్ట్ లకు ఏ సమస్య వచ్చిన..ఎవరైనా దాడులు జరిపిన సహించేది లేదని..అదే మాదిరిగా స్పందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో TUWJ(IJU) వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు, జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్యాల బాలస్వామి, సభ్యత్వ నమోదు ఇంచార్జ్,B.రాజు, కొత్తకోట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంధ్రజ్యోతి రాములు,జిల్లా కార్యదర్శి నాకొండ యాదవ్, సాక్షి రవికుమార్, వార్త స్టాప్ రిపోర్టర్ విజయ్, నరసింహ రాజ్, ఎన్టివి అంజి, బిగ్ టీవీ అరుణ్, వార్త ధనుష్, ప్రజా పక్షం తిరుపతి రెడ్డి, వెలుగు లక్ష్మి నారాయణ, మన తెలంగాణ గోవర్ధన్, ఆంధ్రప్రభ రాజు, పొలిటికల్ పవర్ ఈశ్వర్, NH టీవి అజహర్, ఉర్దూ జర్నలిస్ట్ ఎండి సలాం, ముద్ర న్యూస్ జర్నలిస్ట్ ఖాజా మైనుద్దీన్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సంద రాముడు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.